‘రామారావు ఆన్‌ డ్యూటీ’ ట్రైలర్‌ వచ్చేసింది

మాస్ మహారాజా నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ నుండి అసలైన ట్రైలర్ వచ్చేసింది. క్రాక్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రవితేజ ..ప్రస్తుతం ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. ధమాకా , టైగర్ నాగేశ్వరరావ్ లతో పాటు శరత్ మాండవ డైరెక్షన్లో రామారావు ఆన్ డ్యూటీ చేసాడు. ఈ మూవీ జులై 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ కార్య క్రమాలపై దృష్టి సారించారు. ఇప్పటికే పలు సాంగ్స్ ఆకట్టుకోగా, శనివారం చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసారు.

ఒక ఆపరేషన్ లో వేర్వేరు ప్రాంతాలకు చెందిన కష్టజీవులు మాయమయ్యారని చెప్పడం.. ఒక పాప తన తండ్రిని వెతకడంలో సహాయం చేయమని అడగడంతో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఇందులో రవితేజను ప్రజల కోసం నిలబడే నిజాయితీ గల ప్రభుత్వ అధికారిగా చూపించారు. అయితే ‘ఇన్నాళ్లూ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా చట్ట ప్రకారం న్యాయం కోసం డ్యూటీ చేసిన నేను.. ఇక రామారావుగా ధర్మం కోసం డ్యూటీ చేస్తాను’ అని రవితేజ చెప్పడం చూస్తుంటే.. ధర్మాన్ని కాపాడటానికి అతను వేరే మార్గాన్ని ఎంచుకున్నట్లు అర్థం అవుతోంది.

రవితేజ ట్రైలర్‌లో దుమ్ములేపేశాడు. ధర్మ కోసం డ్యూటీ చేస్తా.. ఇకపై వేట మొదలు అంటూ మాస్ ప్రేక్షకులకు కిక్కిచ్చేలా రవితేజ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. యాక్షన్ సీక్వెన్స్‌లు అదిరిపోయాయి. ఇక రవితేజ రొమాన్స్, లిప్ లాక్ సీన్లు ప్రత్యేక ఆకర్షణగా మారేట్టు కనిపిస్తున్నాయి. ఈ ట్రైలర్‌లో వేణు తొట్టెంపూడికి అంతగా ప్రాధాన్యం ఇవ్వనట్టు అనిపిస్తోంది.

ఇక ఈ మూవీ లో రవితేజకు జోడిగా దివ్యాంకా కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి, నాజర్, నరేశ్, పవిత్రా లోకేష్, సురేఖా వాణి కీలక పాత్రధారులు. స్యామ్‌ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.