ఇది చారిత్రాత్మక, భావోద్వేగ దినోత్సవం

నా స్వప్నం సాకారం: అద్వానీ

LK Advani
LK Advani

New Delhi: నా స్వప్నం సాకార మౌతున్నదని బీజేపీ కురువృద్ధుడు అద్వానీ అన్నారు. రామమందిర నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా ఆయన భావోద్వేగంతో స్పందించారు.

అయన స్పందన అయన మాటల్లోనే ‘ కొన్నిసార్లు ముఖ్య మైన కలలు ఫలించడానికి చాలా సమయం పడుతుంది. చివరకు ఆ కలలు నెరవేరినప్పుడు నిరీ క్షణ కూడా విలువైనదే అవుతుంది. అలాంటి ఒక కల నా హృదయానికి దగ్గరగా ఉంది.

మందిరానికి పునాది వేస్తున్న ప్రధాని మోడీతోపాటు, నాకూ, భారతీయులందరికీ ఇది చారిత్రాత్మక, భావోద్వేగ దినోత్సవం.

రామజన్మభూమి ఉద్యమంలో విధి నాచేత కీలకమైన కర్తవ్యాన్ని నిర్వర్తింప జేసిందని నేను వినమ్రంగా భావిస్తున్నాను. సోమనాథ్‌ నుంచి అయోధ్య వరకు చేపట్టిన రథయాత్ర విధి ప్రేరణతోనే జరిగిందని విశ్వసిస్తున్నాను.

నాటి రథయాత్ర ఎంతోమంది ఆకాంక్షలకు, అభిరుచులు, శక్తికి ప్రతీక. రామజన్మభూమి వద్ద శ్రీరాముడికి గొప్ప మందిరం నిర్మించాలన్నది బీజేపీ ప్రధాన లక్ష్యం.

అది ఇన్నాళ్లకు నెరవేరుతోంది. ఈ శుభసందర్భంగా రామజన్మభూమి ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు.

సుప్రీంకోర్టు తీర్పుతో, మందిర్‌ నిర్మాణం ప్రశాంత వాతావరణంలో ప్రారంభం అవుతున్నందుకు సంతోషంగా ఉంది.

భారతీయుల మధ్య బంధాన్ని బలోపేతం చేయడంలో ఇది ఎంతో దోహదం చేస్తుంది. భారతదేశ సాంస్కృతికి, నాగరిక వారసత్వంలో శ్రీరాముడు గౌరవనీయమైన స్థానాన్ని కలిగివున్నారు.

శ్రీరాముడి సద్గుణాలు భారతీయుల్లో ప్రేరేపించడానికి ఈ ఆలయం ప్రభావితం చేస్తుందని విశ్వసిస్తున్నా’ అని అన్నారు

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/