రామబాణం మూవీ టాక్..

లక్ష్యం, లౌక్యం లాంటి రెండు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ డైరెక్షన్లో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన మూవీ రామబాణం. ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి నటించగా , జగపతి బాబు , కుష్బూ కీలక పాత్రల్లో నటించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. వివేక్ కూచిభోట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఈరోజు (మే 05) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ మూవీ ని చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గోపీచంద్‌ మరోసారి ప్రేక్షకులను మెప్పించలేకపోయారని , సినిమా రొటీన్‌గా ఉందని.. కాలంచెల్లిపోయిన కథతో సినిమా చేశారని విమర్శిస్తున్నారు. గోపీచంద్ తప్ప సినిమాలో ప్లస్ పాయింట్లు ఏమీ లేవని అంటున్నారు. సినిమాలో ఎక్కడా సూపర్ అనిపించే సీన్లు లేవని.. సినిమా చూస్తున్న ప్రేక్షకుడు తరవాత ఏం జరుగుతుందో ఊహించేస్తాడని చెప్పుకొచ్చారు. ఓవరాల్ గా సినిమా కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తుంది.