నేడు రామమందిర్ ట్రస్ట్ తొలి సమావేశం

న్యూఢిల్లీ: కేంద్రం అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో బుధవారం సీనియర్ న్యాయవాది కే పరాశరన్ అధ్యక్షతన ఏర్పాటైన ట్రస్ట్ తొలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే ఆలయ నిర్మాణ పనులకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాగా, ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా రామజన్మభూమి న్యాస్ చీఫ్ మహంతి నృత్య గోపాల్ దాస్‌ను ఆహ్వానించారు. రామమందిర ఉద్యమానికి నాయకత్వం వహించిన వారికి ట్రస్ట్‌లో తగిన ప్రాతినిధ్యం కల్పించలేదని అయోధ్య సాధువులు అసంతృప్తి వ్యక్తం చేసిన వేళ మహంత్ దాస్‌ను ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, గోపాల్ దాస్‌ను ట్రస్ట్‌లో సభ్యుడిగా చేర్చాలని ప్రతిపాదించనున్నట్టు అందులోని సభ్యులు తెలిపారు. అయోధ్య కేసులో హిందూ సంఘాల తరఫున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ పరాశరన్ ట్రస్ట్ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా ఆయన నివాసంలోనే సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలోనే రామమందిర నిర్మాణ పనులు ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటారు. వచ్చే శ్రీరామనవమి లేదా అక్షయ తృతీయ నాడు ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉందని ట్రస్ట్ సభ్యుల్లో ఒకరైన స్వామీ గోవింద్ దేవ్గిరి మహరాజ్ తెలిపారు. అయితే, ట్రస్ట్‌లోని ఇతర సభ్యుల అభిప్రాయాలతో సహా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/