డికె అరుణకు బిజెపిలో ముఖ్యపదవి.. ఆ నేత సపోర్ట్‌

D. K. Aruna
D. K. Aruna

హైదరాబాద్‌: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు ఎవరనే ప్రశ్నకు త్వరలోనే ఓ స్పష్టత ఏర్పడే అవకాశం ఉంది. అయితే మరోసారి కూడా లక్ష్మణ్‌ కు పదవిని ఇచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. కానీ తెలంగాణ కొత్త బిజెపి అధ్యక్ష పదవి తనదే అనే ధీమాలో మాజీమంత్రి డికె అరుణ ఉన్నదని బిజెపి వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె తెలంగాణ సిఎం కెసిఆర్‌, టిఆర్‌ఎస్‌పై దుడుకుగా ప్రవర్తిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో డికె అరుణకు బిజెపి ముఖ్య నేతల్లో ఒకరైన రామ్‌మాధవ్‌ నుంచి స్పష్టమైన హామీ లభించిందనే వార్తలు కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే ఆమె తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకోవడానికి అసలు కారణం అయి ఉండవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. ఏపి, తెలంగాణ బిజెపి వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించే రామ్‌మాధవ్‌ కొత్త బిజెపి అధ్యక్షుడి విషయంలో ప్రత్యేక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/