సమస్యలు లేని నిర్మాణాత్మక భారతదేశమే మోడి లక్ష్యం

Ram Madhav
Ram Madhav

తిరుపతి: తిరుపతిలో రామ్‌మాధవ్‌, ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ సమక్షంలో టిడిపి సీనియర్‌నేత సైకం జనార్ధన్‌రెడ్డి భాజపాలో చేరారు. గతంలో ఆయన రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌గా పని చేశారు. జనార్ధన్‌రెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా రాం మాధవ్‌ మీడియాతో మాట్లాడుతూ..సామాజిక సమస్యలు లేని నిర్మాణాత్మక భారతదేశమే మోదీ లక్ష్యమని అన్నారు. రాజకీయ స్వార్థం ఉన్నవాళ్లయితే అధికార వైకాపాలో చేరుతారని, దేశ ఉజ్వల భవిష్యత్‌ కాంక్షించేవాళ్లు మాత్రం భాజపాలో చేరుతారని ఆయన చెప్పారు. గడిచిన 70 రోజుల్లో మోదీ చూపించిన సత్తానే దీనికి కారణమని రాంమాధవ్‌ పునరుద్ఘాటించారు. ట్రిపుల్‌ తలాక్‌, 370 ఆర్టికల్‌ రద్దు వంటివి మోదీ విజన్‌కు నిదర్శనమని ఆయన కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ 70 రోజుల పాలన ఎలా ఉందో ప్రజలు చూశారని, ఏం జరుగుతుందో బేరీజు వేసుకుంటున్నారని రాంమాధవ్‌ తెలిపారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/