అయోధ్యలో తవ్వకాల్లో బయటపడ్డ ఆలయ శిథిలాలు
తవ్వకాల్లో బయల్పడిన ఐదడుగుల శివలింగం

న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ నిర్మాణం చేపట్టనున్న స్థలాన్ని చదును చేసే క్రమంలో.. ఐదడగుల శివలింగం, చెక్కడాలున్న ఏడు నల్ల గీటురాయి స్తంభాలు, ఆరు ఎర్ర ఇసుకరాతి స్తంభాలు, విరిగిన దేవతావిగ్రహాలు బయల్పడ్డాయి. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్వి చంపత్‌రాయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. గత పదిరోజులుగా అక్కడ భూమి చదును చేసే పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. మే 11న ఈ పనులు మొదలుపెట్టినప్ప టి నుంచీ ఇలాంటి పలు వస్తువులు బయటపడుతున్నాయని విశ్వహిందూ పరిషత్ కూడా పేర్కొంది. రాతిపై చెక్కి న పుష్పాలు, కలశాల వంటివి ఇలా బయటపడినవాటిలో ఉన్నాయని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ తెలిపారు. అయితే ప్రస్తుతం బయటపడిన అవశేషాలు బౌద్ధానికి సంబంధించినవని ఆలిండియా మిల్లీ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ ఖాలిక్ అహ్మద్ ఖాన్ అన్నారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/