దానికి ఒకటే దారి ఉందన్న వర్మ

ట్రంప్‌ భారత్‌ పర్యటనపై వర్మ ట్వీట్‌

ram-gopal-varma-trump
ram-gopal-varma-trump

హైదరాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ 24న భారత్‌ పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసందర్భంగా ట్రంప్‌ భారత్ లో తనను ఆహ్వానించేందుకు మిలియన్ల మంది ప్రజలు వస్తారని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో సెటైరిక్ గా ట్వీట్ చేశారు. ‘ఇండియాలో ట్రంప్ ను 10 మిలియన్ల ప్రజలు ఆహ్వానించాలంటే ఒకటే దారి ఉంది. ట్రంప్ పక్కన అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, రజినీకాంత్, కత్రినా కైఫ్, దీపికా పదుకునే, సన్నీ లియోన్ లను నిల్చోబెడితే అది సాధ్యమే’ అంటూ వర్మ చమత్కరించారు. వర్మ ట్వీట్ పై నెటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కేఏ పాల్, మెగాస్టార్, పవన్ కల్యాణ్ లను మర్చిపోయారంటూ కొందరు రీట్వీట్ చేశారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/