ఆ విషయం కెసిఆర్‌కు కూడా చెప్పలేదు

Ram Gopal Varma and KCR
Ram Gopal Varma and KCR

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెలంగాణ సిఎం కెసిఆర్‌ బయోపిక్‌ను తనకంటే బాగా ఎవ్వరూ తీయలేరని అంటున్నారు అయితే ‘టైగర్‌ కెసిఆర్‌’ ఆయన ఈ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం వర్మ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. దాంతో తెలంగాణ వాసుల్లో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో వర్మ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.నాకు కెసిఆర్‌ లో జాతిపిత మహాత్మా గాంధీ కనిపించారు. బ్రిటిషర్ల నుంచి విముక్తి పొందడానికి గాంధీ అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు. ఆంధ్రుల నుంచి వేరై తెలంగాణ వాసుల కోసం ఓ రాష్ట్రాన్ని తీసుకురావడానికి కూడా కేసీఆర్‌ అదే మార్గాన్ని ఎంచుకున్నారు. నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తానుఅని గతంలో కెసిఆర్‌ చెప్పినప్పుడు ఎవ్వరూ నమ్మలేదు. అందుకే.. ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు అన్న ఉపశీర్షిక పెట్టాను. ఆయన తెలంగాణను తేవడానికి ఏం చేశారు?ఎవరి ద్వారా తీసుకొచ్చారు? ఇవన్నీ ప్రజలకు తెలిసిన అంశాలే. నేను సినిమాలో ఇవన్నీ చూపించాలనుకోవడం లేదు. ఆ కృషి వెనుక ఉన్న కథను తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నాను. బయోపిక్‌ తీస్తున్నానని నేను ట్విటర్‌లో ప్రకటించాను. కానీ కెసిఆర్‌ ను ఎప్పుడూ ట్యాగ్‌ చేయలేదు. చెప్పాలంటే సినిమా తీస్తున్నానని ఆయనకుకూడా చెప్పలేదు అని వర్మ తెలిపారు.


మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/