నాకు అమ్మాయిలన్నా .. వాళ్ల కాళ్లు నాకడమన్నా ఇష్టం – వర్మ

వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ..తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లో తన మనసులోని భావాలను తెలిపాడు. నాకు అమ్మాయిలన్నా .. వాళ్ల కాళ్లు నాకడమన్నా ఇష్టం అంటూ మరోసారి హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. ఒకప్పుడు వర్మ అంటే అగ్ర దర్శకులు, ఆయన నుండి సినిమా వస్తుందంటే అందులో ఏదో కొత్తదనం ఉంటుందని అంత భావించే వారు. కానీ ఇప్పుడు వర్మ అంటే వివాదాలకు కేరాఫ్ అని , పని పాటలేని వ్యక్తి అని , నిత్యం వార్తల్లో నిలిచేందుకు తాపత్రయపడతాడంటూ పేరు వచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే కనీసం రిలీజ్ రోజు పదిమంది కూడా లేని పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ వర్మ అంటే కొంతమందిలో మాత్రం అభిమానం అలాగే ఉంది.

ఇదిలా ఉంటె తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూ లో తన ఫీలింగ్స్ ను బయటపెట్టాడు. “నన్ను లవ్ చేసేవాళ్లన్నా .. నన్ను హేట్ చేసే వాళ్లన్నా నాకు పడదు. నా చావు నేను చస్తా .. మీ బతుకు మీరు బతకండి అనే నేను చెబుతూ ఉంటాను” అన్నారు. “నేను ఎవరి గురించీ ఆలోచించను .. నా గురించి ఆలోచన చేస్తున్నారంటే వాళ్లకి వేరే పని లేదని అర్థం. నా ఆనందానికి యాడ్ అయ్యేవారు నాతో ఉంటారు. అలా కాని రోజున వెంటనే వారిని కట్ చేసేస్తాను. ఒకరిలా మరొకరు ఉండటం సాధ్యం కాదు .. ఈ చిన్న లాజిక్ ను మరిచిపోతున్నారు. నా గురించి తెలిసినవారే ట్విట్టర్ లో నన్ను ఫాలో అవుతున్నారు. ఇష్టం లేకపోతే బయటికి వెళ్లిపోయే సదుపాయం కూడా ఉంది కదా” అని తెలిపాడు.

అలాగే “నాకు అమ్మాయిలన్నా .. వాళ్ల కాళ్లు నాకడమన్నా ఇష్టం. ఎవరో ఏదో అనుకుంటారనేది నేను పట్టించుకోను. మీరు వేసుకున్న పింక్ డ్రెస్ నాకు నచ్చలేదు. కానీ ఆ విషయం చెప్పడానికి నేను ఎవరు? అది మీ ఇష్టానికి సంబంధించింది. ఎందుకు మీరు పింక్ వేసుకున్నారో నాకు అర్థం కావడం లేదు .. అదో చెత్త కలర్ అని చెబితే మీకు ఎలా ఉంటుందో .. నాకూ అలాగే ఉంటుంది” అన్నారు సదరు యాంకర్ తో..మొత్తం మీద మరోసారి వర్మ ఈ ఇంటర్వ్యూ తో వార్తల్లో నిలిచారు.