మరో బిజినెస్ డీల్ కుదుర్చుకున్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కేవలం నటుడే కాదు నిర్మాతగానూ , బిజినెస్ మాన్ గాను రాణిస్తున్నాడు. ఇప్పటికే పలు బిజినెస్ లు చేస్తున్న ఈయన..తాజాగా మరో బిజినెస్ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చరణ్ సైన్ చేసినట్లు సమాచారం. బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు రామ్ చరణ్ భారీ మొత్తం డిమాండ్ చేయగా, అందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తమ సంస్థ‌కు చ‌ర‌ణ్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండ‌డంపై స‌ద‌రు సంస్థ కూడా సంతోషం వ్య‌క్తం చేసిన‌ట్టు సమాచారం. ఈ డీల్ ఒక సంవత్సరం పాటు కొనసాగినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో చరణ్ కారణంగా తమ యాప్ కు సభ్యులుగా మారడానికి మిలియన్ల మంది చందాదారులు ఆకర్షితులవుతారని హాట్‌స్టార్ నిర్వహకులు అంచనా వేస్తున్నారు.అలాగే, హాట్‌స్టార్ ప్రస్తుతం తెలుగు వెబ్ సిరీస్‌లు మరియు చలనచిత్రాలతో సహా అనేక తెలుగు ఒరిజినల్స్ రూపొందించడంపై దృష్టి సారించింది.

ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా విడుదలకు సిద్దమవుతున్న సమయంలో చరణ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా చేర్చడంతో, OTT వైపు ఎక్కువ మందిని ఆకర్షించడానికి వీలుంటుందని అంత అంటున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆయన రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో రామ్ చరణ్‌తో పాటు, ఎన్టీఆర్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీ లోను చరణ్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు. రీసెంట్ గా శంకర్ మూవీ ని కూడా స్టార్ట్ చేసాడు.