బిగ్ బ్రేకింగ్: హీరో రామ్ చరణ్‌కు కరోనా పాజిటివ్

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ తన పంజా విసురుతూ వెళ్తోంది. గతకొన్ని నెలలుగా యావత్ ప్రపంచం ఈ వైరస్ కారణంగా తీవ్ర కష్టాలను ఎదుర్కొంటోంది. కాగా ఈ వైరస్ సామాన్యులు, ప్రముఖులు అనే తేడా లేకుండా అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తోంది. కాగా చాలా మంది ఈ మహమ్మారి బారిన పడి మృత్యువాత పడ్డారు. తాజాగా ప్రముఖ తెలుగు హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వైరస్ బారిన పడ్డారు.

రామ్ చరణ్ తనకు కరోనా సోకిందనే విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఎలాంటి లక్షణాలు లేకున్నా తనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో హోమ్ క్వారంటైన్‌లో ఉన్నానని, గత రెండు రోజులుగా తన చుట్టూ ఉన్నవారు తప్పకుండా పరీక్ష చేయించుకోవాల్సిందిగా రామ్ చరణ్ కోరారు. తనకు కరోనా పాజిటివ్ అని రావడంతో తన కుటుంబ సభ్యులకు దూరంగా హోమ్ క్వారంటైన్ ఉంటున్నానని, తన ఆరోగ్యం పట్ల ఎవరూ ఆందోళనకు గురికావద్దని చరణ్ ఈ సందర్భంగా కోరారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇలా కరోనా బారిన పడటంతో యావత్ టాలీవుడ్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యింది. ఇక తమ అభిమాన హీరో త్వరగా ఈ కరోనా వైరస్ బారి నుండి బయటపడాలని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు. కాగా రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్, ఆచార్య చిత్రాల షూటింగ్ జరుగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.