పాన్ ఇండియా మూవీను రెడీ చేస్తోన్న చరణ్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్‌ను బాహుబలి సృష్టికర్త రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్‌లో మరో స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా షూటింగ్ అనుకున్న దానికంటే చాలా ఆలస్యంగా జరుగుతుండటంతో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు.

కాగా ఈ సినిమా పూర్తయ్యాక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏ సినిమా చేస్తాడా అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఇప్పటివరకు ఏ డైరెక్టర్‌కు కూడా చరణ్ ఓకే చెప్పలేదు. దీంతో చరణ్ ఎవరితో సినిమా చేస్తాడో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. కాగా ఇటీవల దర్శకులు వెంకీ కుడుముల, గౌతమ్ తిన్నూరిలు చరణ్‌కు తమ కథలు వినిపించినట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే గౌతమ్ చెప్పిన కథకు చరణ్ ఓకే చెప్పినట్లు కూడా తెలుస్తోంది.

ఇక గౌతమ్ చెప్పిన కథ పాన్ ఇండియా సబ్జెక్ట్ అని, అందుకే ఆ సినిమాను ఆర్ఆర్ఆర్ పూర్తయ్యాకే ప్రారంభించాలని చరణ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో సోలోగా పాన్ ఇండియా మూవీతో హిట్ కొట్టాలని చరణ్ కసిగా ఉన్నట్లు తెలుస్తోంది. అటు అల్లు అర్జున్ పుష్పతో, ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌పై కన్నేశారని, అందుకే తాను కూడా పాన్ ఇండియా సబ్జెక్టును రెడీ చేయాలని చరణ్ ఆలోచిస్తున్నాడట. మరి చరణ్ నిజంగానే పాన్ ఇండియా సబ్జెక్టును లైన్‌లో పెడుతున్నాడా అనేది తెలియాలంటే సినిమా పట్టాలెక్కే వరకు ఆగాల్సిందే.