విశ్వక్ సేన్ ను ఆకాశానికి ఎత్తిన మెగా పవర్ స్టార్

యంగ్ హీరో విశ్వక్ సేన్ ఫై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రసంశలు కురిపించారు. అందరు విశ్వక్ కు దూకుడు ఎక్కువ..ముక్కు సూటిగా మాట్లాడతారని ఇలా పలు రకాలుగా మాట్లాడుకుంటారు..కానీ ఆయనలో ఓ మంచి గుణం ఉంది..ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట తప్పడని, ఇచ్చిన మాట కోసం ఎంతకైనా వెళ్తారని అన్నారు మెగా పవర్ స్టార్.

విశ్వక్ సేన్ నటించిన ‘ఓరి దేవుడా’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం రాజమండ్రిలో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రామ్ చరణ్ పాల్గొని ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విశ్వక్ సేన్ తెలియని వారు ఎవరూ లేరు. అతి తక్కువ సమయంలో ఎక్కువ హిట్స్‌తో అందరి గుండుల్లో స్థానం సంపాదించాడు. ఫలక్‌నుమా నుంచి రాజమండ్రి వరకు.. వైజాగ్ నుంచి చిత్తూరు వరకు గల్లీగల్లీలో ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే, విశ్వక్ సినిమాల్లో ‘ఫలక్‌నుమా దాస్’ చూశాను. ఇతనికి యూత్, రెబల్, రేజింగ్ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ, ఇతని పర్సనాలిటీకి నేను పెద్ద ఫ్యాన్‌ని. సినిమాలో హీరో కన్నా బయట ఇతని పర్సనాలిటీకి నేను పెద్ద ఫ్యాన్ అన్నాడు చరణ్.

మంచో చెడో ఇచ్చిన మాట మీద విశ్వక్ సేన్ నిలబడతాడనే మాట బయట అందరిలో పాకుతోంది. నేను కూడా గమనించాను. తప్పో ఒప్పో విశ్వక్ సేన్.. మాటిచ్చామంటే నిలబడదాం. తప్పయితే ఏముంది సారీ చెప్తాం. పక్కనున్న వాళ్ల కోసం నిలబడటం, ఏదైనా సహాయం కావాలన్నా చేయడం.. కష్టాల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా విశ్వక్ సేన్ దగ్గరకు వెళ్దాం అనే ఆలోచన రావడమే ఆయన సాధించిన పెద్ద విజయం’’ అని విశ్వక్ ను ఆకాశానికి ఎత్తారు. అక్టోబర్ 21న థియేటర్లలోకి వస్తోన్న ‘ఓరి దేవుడా’ సినిమాను అందరూ చూడాలని రామ్ చరణ్ కోరారు.