రెండున్నర కోట్ల ఖరీదైన కారును కొనుగోలు చేసిన చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండున్నర కోట్ల ఖరీదైన కారును కొనుగోలు చేసారు. రీసెంట్ గా ఎన్టీఆర్ ఇటలీకి చెందిన వోక్స్ వాగన్ కంపెనీ అనుబంధ సంస్థనే ‘లంబోర్ఘిని’ కార్ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చరణ్ కూడా ఎన్టీఆర్ బాటలోనే నిలిచారు. చరణ్ తనకు న‌చ్చిన‌ట్టుగా కారును డిజైన్ చేయించుకున్న‌ట్టు తెలుస్తుంది. తాజాగా ఈ కారుని చరణ్ హ్యాండోవ‌ర్ చేయ‌గా, బ్లాక్ కలర్ బెంజ్ కారులో రామ్ చరణ్ రయ్‌మని వెళ్లిపోయారు. దీని ధర దాదాపు రెండున్నర కోట్లు ఉంటుందని సమాచారం. ఈ కారుకి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చరణ్ ..ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ప్రస్తుతం ఫిలిం నగర్ సమాచారం మేరకు ఈ మూవీ 2022 సంక్రాంతి బరిలో రానుందని అంటున్నారు.

Megapower Star @AlwaysRamCharan receives his new Mercedes Maybach GLS 600 #RamCharan pic.twitter.com/AV6kK3K2UB— BA Raju’s Team (@baraju_SuperHit) September 12, 2021