‘అభ్యుదయం’ పార్టీకి ప్రచారం చేస్తున్న రామ్ చరణ్

RRR తో పాన్ ఇండియా హిట్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ లో శ్రీకాంత్, అంజలి , రాజీవ్ కనకాల మొదలగువారు నటిస్తున్నారు. ఇప్పటీకే సగం పైగా షూటింగ్ పూర్తి చేసుకోగా..ప్రస్తుతం కర్నూల్ లో తాజా షెడ్యూల్ జరుపుకుంటుంది.

కాగా ఈ షూటింగ్ తాలూకా వీడియోస్ బయటకు వచ్చి సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ చిత్రంలో చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడని , ఓ పాత్ర పొలిటికల్ లీడర్ పాత్ర అని గత కొద్దీ రోజులుగా ప్రచారం అవుతూ వస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో చరణ్ ‘అభ్యుదయం’ పార్టీ తరుపున ప్రచారం చేయబోతున్నట్లు తాజాగా లీకైన వీడియోస్ చూస్తే అర్ధమవుతుంది. ఈ వీడియో లో రామ్ చరణ్‌తో పాటు శ్రీకాంత్, రాజీవ్ కనకాల కూడా ఉన్నారు. ఈ మూవీలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణీ నటిస్తోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.