బుచ్చిబాబు తో సినిమా మాములుగా ఉండదు – రామ్ చరణ్

ఆర్ఆర్ఆర్ తో వరల్డ్ వైడ్ గా పాపులర్ అయినా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో తన 15 వ చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చరణ్ చెప్పుకొచ్చాడు. ఈ చిత్రంలో నా పాత్ర పాత్‌ బ్రేకింగ్‌గా ఉంటుంది. ఆ పాత్ర రంగస్థలం లాంటి నా పాత రికార్డులను బీట్‌ చేసేలా ఉంటుంది. మట్టిలాంటి పాత్ర అది. వెస్ట్రన్‌ ఆడియన్స్‌ కూడా ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. నటుడిగా ఎక్కువ మందికి రీచ్‌ కావడమే నా లక్ష్యం అని తెలిపాడు చరణ్.

అలాగే హాలీవుడ్ ఎంట్రీ ఫై క్లారిటీ ఇచ్చాడు. ‘‘నేను హాలీవుడ్‌ సినిమాల్లో నటించాలనుకుంటున్నా. ఆ కల నెరవేరాలని కోరుకోండి. హాలీవుడ్‌ ప్రాజ్టెన్‌కు సంతకం చేశానా? లేదా? అనేది ఇప్పుడే మాట్లాడడం కరెక్ట్‌ కాదు. ఏ పనికైనా ఓ ప్రాసెస్‌ ఉంటుంది కదా. మెటీరియలైజ్‌ అయ్యేదాకా ప్రాసెస్‌లో ఉన్నట్లే కదా? కానీ తప్పకుండా ఆ ప్రాజెక్ట్‌ జరిగి తీరుతుంది(నవ్వుతూ). చాలా విషయాలు నేను బయటకు చెప్పను. జనాల దృష్టి మనపై పడకూడదని, దిష్టి తగలకూడదని అమ్మ తరచూ చెబుతుంటుంది అని చెప్పుకొచ్చాడు.