గుంటూరు-హైదరాబాద్ మధ్య నిలిచిన రాకపోకలు

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న రాళ్లవాగు

గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు

పంట పొలాల్లో నీరు నిలవడంతో రైతుల ఆందోళన

లోతట్టు ప్రాంతాలు జలమయం… విద్యుత్ సరఫరాకు అంతరాయం

Rallavaadu Floating
Rallavaadu Floating

Guntur : గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  వాగులు వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. 
ముఖ్యంగా, రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద రాళ్లవాగు పోటెత్తుతోంది. 
దాంతో గుంటూరు, హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 
అటు, తాడికొండ, నరసరావుపేట, పెదకూరపాడు, ప్రత్తిపాడు, యడ్లపాడు, కాకుమాను, పెదనందిపాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. 
పొలాలు జలమయం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
చాలా ప్రాంతాల్లో రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. 
భారీ వర్షాల కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.