స్టార్ బ్యూటీ రకుల్‌కు కరోనా పాజిటివ్

స్టార్ బ్యూటీ రకుల్‌కు కరోనా పాజిటివ్

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, ఇటీవల వరుసబెట్టి సినిమాలు ఓకే చూస్తూ దూసుకుపోతుంది. ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటిన రకుల్, ఆ తరువాత వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతూ వచ్చింది. దీంతో అమ్మడికి సినిమా ఛాన్సులు బాగా తగ్గిపోయాయి. ఓ క్రమంలో రకుల్ ఇక ఫేడవుట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ తిరిగి వరుసగా సినిమాలు ఓకే చేస్తూ అమ్మడు తన సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది. కాగా తాజాగా రకుల్ ప్రీత్ ఓ బ్యాడ్ న్యూస్‌ను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

తాను కరోనా వైరస్ బారిన పడినట్లు రకుల్ స్పష్టం చేసింది. తనకు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని, త్వరలోనే ఈ మహమ్మారిని జయిస్తానని రకుల్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. తనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో తాను ఆందోళనకు గురయ్యాయని, అయితే వైద్యులు తనకు నిరంతరం చికిత్స అందిస్తున్నట్లు ఆమె పేర్కొంది. తనను గతకొద్ది రోజులుగా కలిసిన వారు తప్పకుండా కరోనా పరీక్ష చేయించుకోవాల్సిందిగా రకుల్ కోరింది. ఈ మేరకు తన సోషల్ అకౌంట్‌లో పోస్ట చేసింది.

రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా సోకిందనే వార్తతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందనుకుంటున్న సమయంలో ఇలా రకుల్‌కు పాజిటివ్ తేలడంతో ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఆమె త్వరగా ఈ మహమ్మారి నుండి కోలుకోవాలని అభిమానులు కోరుతున్నారు. ఇక సినిమాల పరంగా రకుల్ ప్రీత్ ప్రస్తుతం మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.