బికినీలో జిల్ చిల్

Rakul Preet singh in Vacation
Rakul Preet singh in Vacation

వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉక్కిరి బిక్కిరి అవుతోంది పంజాబి కుడి రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు నటించిన మూడు సినిమాలు ఈ ఏడాది రిలీజైపోయాయి ఇప్పటికే. ఇటీవలే మన్మధుడు 2 రిలీజైంది. దేదే ప్యార్ దే- ఎన్జీకే లాంటి భారీ చిత్రాల్లో నటించింది. తదుపరి సిద్ధార్థ్ మల్హోత్రా సరసన ఓ భారీ చిత్రంలో నటించేందుకు సన్నాహాలు చేస్తోంది.
 రకుల్ కాస్తంత పెద్ద బ్రేక్ తీసుకుని స్పెయిన్ – ఇబిజ లొకేషన్ కి వెళ్లిపోయింది. రెండు మూడు వారాల ట్రిప్ ఇదని తెలుస్తోంది. అక్కడేం చేస్తోంది? అంటే ఇదిగో ఈ ఫోటో చూస్తే మీకే అర్థమవుతుంది. అదిరిపోయే లొకేషన్ లో ఫుల్ గా చిలౌట్ చేస్తోంది. మొన్ననే మన్మధుడు 2 కోసం స్పెయిన్ కి వెళ్లి వచ్చింది. ఇంతలోనే మళ్లీ అక్కడికే ఎందుకు వెళ్లింది! అంటే అంతగా ఆ డెస్టినేషన్ నచ్చిందట. ఇన్ స్టాలో బులుగు బికినీ ఫోటోల్ని షేర్ చేసి దానికి ఆసక్తికర వ్యాఖ్యను జోడించింది. “పైన నీలాకాశం.. కింద ఇసుక.. ప్రశాంతంగా ఉంది. ఇబిజలో ఉన్నాను“ అని జోష్ చూపించింది రకుల్.