రకుల్ ఫ్యూచర్ ప్రాజెక్టులు
మేనేజర్ క్లారిటీ

బ్యూటీ రకుల్ స్టార్ హీరోల సరసన నటించిన సంగతి తెలిసిందే.. అలా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
దాదాపు అయిదేళ్లపాటు తెలుగు , తమిళ , హిందీ భాషల్లో క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ఈ క్రమంలో ఆమెనటించే ఫ్యూచర్ ప్రాజెక్టులపై వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ ఆమె మేనేజర్ క్లారిటీ ఇచ్చారు.
రకుల్ ప్రస్తుతం చెక్ సినిమాలో యూత్‌స్టార్ నితిన్ సరసన నటిస్తోంది.. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు..
ఈచిత్రంలో రకుల్ అడ్వకేట్ పాత్రలో కన్పించనుంది. దీంతోపాటు మెగా హీరో పంజా వైష్ణవ్‌తేజ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో కూడ రకుల్ నటిస్తోంది..
ఇటీవలే షూటింగ్ పూర్తయింది.. ఇక బాలీవుడ్లో స్టార్హీరో జాన్ అబ్రహాంతో కలిసి ఎటాక్ అనే సినిమాలో నటిస్తోంది..
అలాగే అర్జున్‌కపూర్‌తో కలిసి ఓ సినిమా చేస్తోంది.. రకుల్ బిగ్‌బి అమితాబ్‌బచ్చన్ – అజయ్ దేవగన్ ప్రధానపాత్రల్లో నటిస్తున్న ‘మే డే సినిమాలో కూడ హీరోయిన్గా ఎంపికైంది..
ఇలా మూడు క్రేజీ ప్రాజెక్టులతో రకుల్ బాలీవుడ్లో బిజీగా మారింది.. కోలీవుడ్‌లో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ‘అయలాన్ చిత్రంలో నటిస్తోంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం :https://www.vaartha.com/news/international-news/