‘రాక్షసుడు’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

RAKSHASUDU Pre Release Event
RAKSHASUDU Pre Release Event

బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా రమేష్‌వర్మ పెన్మత్స దర్శకత్వంలో ఏ స్టూడియోస్‌ , ఎహనీష్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం రాక్షసుడు. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా ఈచిత్రాన్ని ఆగస్టు2న విడుదల చేస్తున్నారు. ఈసినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.. రాక్షసుడు ట్రైలర్‌ను నారాయణదాస్‌ నారంగ్‌ విడుదల చేశారు. తొలి టిక్కెట్‌ను హీరో బెల్లంకొండ , అనుపమ పరమేశ్వరన్‌ నిర్మాత కోనేరు సత్యనారాయణ విడుదల చేశారు.. తొలి టికెట్‌ను తలసాని సాయియాదవ్‌ కొనుగోలుచేశారు..నిర్మాత కోనేరు మాట్లాడుతూ, సినిమా చాలా ఉద్విగ్నంగా ఉంటుందనానరు.. పోస్ట్‌ప్రొడక్షన్స్‌లో టాప్‌ టెక్నీషియన్లను తీసుకున్నామన్నారు..హీరో బెల్లంకొండ అద్భుతంగా నటిచాడని అన్నారు.. మంచి నటీనటులు, టెక్నీషియన్లు ఈసినిమాకు లభించటం తన అదృష్టమన్నారు.. బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ, సాయి శ్రీనివాస్‌ 7వ సినిమా అనఆనరు. ఒక నిర్మాత కొడుకుగా కాకుండా, సొంత టాలెంట్‌తో ఆకట్టుకుంటున్నాడని అనఆనరు.. కోనేరు సత్యనారాయణగారు తొలిసినిమానే అయినా చాలా పర్ఫెక్ట్‌గాచేశారన్నారు.. అనుపమ మంచి సినిమాలు చేస్తోందని అభినందించారు.. కార్యక్రమంలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ, మంచి స్క్రిప్టు దొరకటం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అభిషేక్‌ నామా, అనీల్‌ రావిపూడి, మల్టీడైమన్షన్‌ వాసు, తలసాని సాయి యాదవ్‌, చిత్ర దర్శకుడు రమేష్‌ వర్మ, హీరోయిన్‌ అనుపమ ప్రసంగించారు