రెండో రోజు ప్రారంభమైన రాజ్యసభ

న్యూఢిల్లీ: రెండో రోజు పార్లమెంట వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలువురు జీరో అవర్లో పలు అంశాలపై చర్చించాలంటూ చైర్మన్కు నోటీసులు ఇచ్చారు. ‘నీట్ పరీక్షల నిర్వహణతో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, ఈ అంశంపై జీరో అవర్లో చర్చించాలని డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ నోటీసు ఇచ్చారు. కొవిడ్-19 కమ్యూనిటీ వ్యాప్తిపై టీఎంసీ ఎంపీ శాంతుసేన్, మరాఠా సామాజిక వర్గానికి రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతావ్, సినీ పరిశ్రమను కించపరిచే కుట్ర ఆరోపణలపై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ రాజ్యసభలో నోటీసులు అందజేశారు. అలాగే ఇవాళ రాజ్యసభలో కేంద్రం పలు బిల్లులు ప్రవేశపెట్టనుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/