వాయిదా పడ్డ లోక్‌సభ, రాజ్యసభ

లోక్‌సభ 12 గంటల వరకు… రాజ్యసభ 2 గంటలకు

Parliament of India
Parliament of India

న్యూఢిల్లీ: రెండవ విడత పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. సభ సజావుగా సాగేలా సహకరించాలని స్వీకర్ ఓం బిర్లా సభ్యులను కోరారు. సభ్యులు ఎవరూ ప్లకార్డులు పట్టుకుని పోడియం వద్దకు రావద్దని స్వీకర్ సూచించారు. లోక్ సభలో ఢిల్లీ అల్లర్ల ఘటనపై చర్చించాలని కాంగ్రెస్ నేతలు పట్టుబట్టారు. విపక్షాలు సభ కార్యక్రమానికి అడ్డుతగలడంతో స్వీకర్ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. అన్ని అంశాలపై తాము చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పార్లమెంట్ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించిన సభలో పరిస్థితి అదుపులోకి రాలేదు. అటు రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/