రాజ్యసభ 15వ తేదీకి వాయిదా

న్యూఢిల్లీ: కేంద్ర సాగు చట్టాలు, ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా రాజ్యసభలో విపక్షాల ఆందోళన బుధవారం నాడు కూడా కొనసాగింది. తక్షణం ఈ అంశాలపై చర్చించాలంటూ సభా కార్యక్రమాలకు విపక్షాలు అడ్డుకున్నాయి. దీంతో రెండు సార్లు వాయిదా పడిన సభ… ఆ తర్వాత మార్చి 15వ తేదీ వరకూ వాయిదా పడింది. తొలుత సభాకార్యక్రమాలు ప్రారంభం కాగానే, విపక్ష ఎంపీలు సాగు చట్టాలకు, రోజురోజుకూ పెరుగుతున్ని ఇంధనం ధరలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దీంతో సభా కార్యక్రమాలను మధ్యాహ్నం 12 గంటల వరకూ రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్ హరివంశ్ వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ పరిస్థితిలో మార్పులేకపోవడంతో 2 గంటల వరకూ సభ వాయిదా పడింది. అనంతరం సభ తిరిగి ప్రారంభమైనా విపక్షాలు వెన్కక్కి తగ్గలేదు. సాగు చట్టాలు, ఇంధన ధరల పెరుగుదలపై చర్చించాలంటూ పట్టుపట్టాయి. దీంతో సభను మార్చి 15వ తేదీ వరకూ వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ చైర్‌పర్సన్ ప్రకటించారు. పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు గత సోమవారంనాడు ప్రారంభమయ్యాయి.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/