అభిమానికి పాదచాలనం చేసిన రజనీకాంత్‌

కేరళ నుంచి అభిమానిని పిలిపించుకుని ముచ్చట్లు

Rajinikanth
Rajinikanth

చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్, తన పుట్టిన తిథి, నక్షత్రం ప్రకారం సోమవారం నాడు పుట్టిన రోజును జరుపుకున్నారు. చెన్నైలోని తన నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో కేరళకు చెందిన వీరాభిమానిని ప్రత్యేకంగా పిలిపించుకుని కలిశారు రజనీ. ప్రత్యేక ప్రతిభావంతుడైన అతనికి కరచాలనం చేసేందుకు చేతులు లేవు. దీంతో రజనీ అతని పాదాలను తాకి పాదచాలనం చేశారు. అతనితో కాసేపు ముచ్చటించారు. ఈ చిత్రాలు వైరల్ అవుతున్నాయి. తేదీల ప్రకారం, ఈ నెల 12న రజనీ పుట్టిన రోజు కాగా, అత్యంత వేడుకగా జరిపేందుకు అభిమాన సంఘాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/