రష్యా రక్షణ మంత్రితో రాజ్‌నాథ్‌ భేటి

rajnath-singh-meets-russian-defence-minister-sergey-shoigu

మాస్కో: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు రాజ్‌నాథ్ సింగ్ మాస్కోలో ర‌క్ష‌ణ మంత్రి కార్యాల‌యంలో  ఆ దేశ ర‌క్ష‌ణ మంత్రి జ‌న‌ర‌ల్ సెర్గీ షోగితో భేటీ అయ్యారు. దాదాపు ఇద్దరూ గంట పాటు స‌మావేశం నిర్వ‌హించారు. రెండు దేశాల మ‌ధ్య స‌హ‌కారానికి సంబంధించిన అనేక అంశాల‌ను వారు చ‌ర్చించారు. రెండు రోజుల్లో మాలాకా సంధిలో రెండు దేశాల మ‌ధ్య ఇంద్రా నౌకాద‌ళ విన్యాసాలు జ‌ర‌గ‌నున్న‌నేప‌థ్యంలో ఈ భేటీ జ‌ర‌గ‌డం విశేషం. నౌకాద‌ళ విన్యాసాల‌పై రాజ్‌నాథ్ కామెంట్ చేశారు. ఈ విన్యాసాలు హిందూమ‌హాస‌ముద్రంలో రెండు దేశాల నౌకాద‌ళ శ‌క్తిని చాటుతాయని ఆయ‌న అన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/