వ్యవసాయ చట్టాలు రైతుల మంచి కోసమే

చట్టాలను ఎట్టిపరిస్థితుల్లో వెనక్కితీసుకునేది లేదు..రాజ్‌నాథ్‌ సింగ్‌

Rajnath Singh

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేస్తున్న ఆందోళనలు 19వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్నదాతలు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టారు. మరోవైపు కేంద్ర క్యాబినెట్ సీనియర్ మంత్రులు కూడా సమావేశమై రైతుల ఆందోళనపై చర్చించారు. ఇదే సమయంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను ఎట్టిపరిస్థితుల్లో వెనక్కితీసుకునేది లేదన్నారు. ఈ మూడు చట్టాలు రైతుల మంచి కోసమేనని, వాటిని ప్రభుత్వం తిరిగి తీసుకోదని ఫిక్కీ కార్యక్రమంలో మాట్లాడుతూ..రాజ్‌నాథ్‌ సింగ్ స్పష్టం చేశారు. రైతుల మాట వినడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నదని, అయితే రైతుల పేరిట రాజకీయాలు ఉండకూడదని ఆయనన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/