కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ గా రాజీవ్ కుమార్

బాధ్యతల స్వీకారం

Rajiv kumar
Rajiv kumar

New Delhi: కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ (సీఈసీ)గా సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ ఆదివారం బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఇప్పటి వరకు ఆయన కేంద్ర ఎన్నిక‌ల సంఘంలో క‌మిష‌న‌ర్‌గా పనిచేశారు. కాగా తాజాగా, రాజీవ్ కుమార్ ను ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌గా నియ‌మిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో రాజీవ్ కుమార్ సీఈసీగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. సీఈసీగా కొన‌సాగిన సుశీల్ చంద్ర శనివారం ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, సీఈసీగా రాజీవ్ కుమార్ 2025 ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు కొన‌సాగ‌నున్నారు. 2024లో జరిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న రాష్ట్రప‌తి, ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌ను కూడా రాజీవ్‌కుమార్ నిర్వ‌హించ‌నున్నారు.

‘తెర'(సినిమా) వార్తల కోసం : https://www.vaartha.com/news/movies/