సీఏఏ ఆందోళనలపై స్పందించిన రజనీకాంత్‌

ఏ సమస్యకైనా హింస పరిష్కార మార్గం కాకూడదు

Rajinikanth
Rajinikanth

చెన్నై: ప్రముఖ నటుడు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై స్పందించారు. ఈ నేపథ్యంలో సినీ నటుడు రజనీకాంత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఏ సమస్యకైనా హింస పరిష్కార మార్గం కాకూడదని ఆయన అన్నారు. జాతి సమగ్రత, ఐక్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని కోరారు. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న హింస బాధను కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని, సంయమనం పాటించాలని విన్నవించారు. కాగా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ఈ ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చాయి. పలు చోట్ల ఆందోళనకారులు ఆస్తులకు నిప్పుపెట్టారు. ఈ ఆందోళనల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/