రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

Rajdhani Express
Rajdhani Express

ఫిరోజాబాద్(యుపి): ఢిల్లీ నుంచి హౌరా వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్, మగధ్ ఎక్స్‌ప్రెస్ మంగళవారం తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాయి. విరిగిపోయిన రైలు పట్టాలను చూసిన మగధ్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ రైలును ఎమర్జెన్సీ బ్రేకులు వేసి నిలిపివేయడంతో అనేక రైళ్లకు పెను ప్రమాదం తప్పింది. ఇస్లామ్‌పూర్ నుంచి ఢిల్లీ వెళుతున్న మగధ్ ఎక్స్‌ప్రెస్ ఆలస్యంగా నడుస్తుండడంతో మంగళవారం ఉదయం కాన్పూర్ సెక్షన్‌లోని భర్తానా స్టేషన్ సమీపిస్తుండగా రైలు పట్టాలు 14 అంగుళాల మేర విరిగిపోయి ఉండడాన్ని డ్రైవర్ చూశాడు. వెంటనే రైలును ఆపివేసి తుండ్లలోని మెయిన్ కంట్రోల్ రూముకు సమాచారం అందచేశాడు. వెంటనే రైల్వే అధికారులు వెనుకనే రాజధాని ఎక్స్‌ప్రెస్‌తోపాటు పాట్నాన్యూఢిల్లీ రాజధాని, కాన్పూర్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. రైల్వే ఇంజనీరింగ్ శాఖకు చెందిన నిపుణుల బృందం తాత్కాలికంగా పట్టాలను పునరుద్ధరించింది. ఆ తర్వాత రెండు గంటల ఆలస్యంగా అన్ని రైళ్లు తమ గమ్యస్థానాలకు బయలుదేరి వెళ్లాయి.


తాజా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/