సీఎం గెహ్లాట్ గత బడ్జెట్‌ను చదివారు.. అసెంబ్లీలో ప్రతిపక్షాల ఆందోళ‌న‌

Rajasthan CM Ashok Gehlot reads excerpts from previous budget, alleges Opposition

జైపూర్‌: రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఈరోజు గ‌త ఏడాది బ‌డ్జెట్ చ‌ద‌వినిట్లు ప్ర‌తిప‌క్షాలు ఆరోపించాయి. 2023-24 సంవ‌త్స‌రానికి చెందిన బ‌డ్జెట్‌ను ఇవాళ సీఎం గెహ్లాట్ అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టారు. ప్ర‌సంగంలో భాగంగా సీఎం గెహ్లాట్ రెండు ప్ర‌క‌ట‌న‌లు చేయ‌గానే.. విప‌క్షాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. ఆ రెండు స్కీమ్‌లు గ‌త ఏడాది బ‌డ్జెట్‌లో ఉన్న‌ట్లు విప‌క్షాలు ఆరోపించాయి. వెల్‌లోకి దూసుకెళ్లిన ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు నినాదాలు చేశాయి.

ఆ స‌మ‌యంలో స్పీక‌ర్ సీపీ జోషి క‌ల‌గ‌చేసుకుని.. విప‌క్షాలు ఆందోళ‌న వీడాల‌న్నారు. కానీ ప్ర‌తిప‌క్ష స‌భ్యులు నినాదాల‌ను ఆప‌లేదు. దీంతో స్పీక‌ర్ స‌భ‌ను అర‌గంట వాయిదా వేశారు. స‌భ‌ను వాయిదా వేయ‌డంతో బిజెపి ఎమ్మెల్యేలు వెల్‌లోనే నిర‌స‌న కొన‌సాగించారు. బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌రాదు అని, అది లీకైందా అని బిజెపి నేత గులాబ్ చాంద్ క‌టారియా తెలిపారు. గత ఏడాది బ‌డ్జెట్‌లోని ప‌ట్ట‌ణ ఉద్యోగ క‌ల్ప‌న‌, కృషి బ‌డ్జెట్ అంశాల‌పై సీఎం గెహ్లాట్ పాత లెక్క‌లు చ‌దివిన‌ట్లు బిజెపి ఆరోప‌ణ‌లు చేసింది. 8 నిమిషాల పాటు పాత బ‌డ్జెట్‌నే గెహ్లాట్ చ‌దివార‌ని మాజీ సీఎం వ‌సుంధ‌రా రాజే ఆరోపించారు.