నాలుగు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఫిరోజ్ షా కోట్లా వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్‌కు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. ఇశాంత్ వేసిన రెండవ ఓవర్ చివరి బంతికి రహానే(2) ధావన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత మళ్లీ ఇశాంత్ వేసిన నాలుగో ఓవర్ ఐదో బంతికి లివింగ్‌స్టోన్(14) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే అక్సర్ వేసిన ఓవర్లో సంజూ శాంసన్(5) రనౌట్ అయ్యాడు. ఇక ఇశాంత్ వేసిన ఆరో ఓవర్ మొదటి బంతికి ఫోర్ కొట్టిన లామ్రోర్(8) ఆ తర్వాతి బంతికి పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో 10 ఓవర్లు ముగిసే వరకు 4 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో శ్రేయాస్ గోపాల్(11), రియాన్ పరాగ్(14)లు ఉన్నారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/