సూపర్‌స్టార్‌కు యుపి ప్రభుత్వ సెక్యూరిటీ

RAJANIKANTH
RAJANIKANTH

సూపర్‌స్టార్‌కు యుపి ప్రభుత్వ సెక్యూరిటీ

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, .. ఈపేరుకు ఉన్న క్రేజ్‌ చెప్పనవసరం లేదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కలిగిఉన్న అతికొద్ది మంది ఇండియన్‌ హీరోల్లో మొదటివరుసలో నిలుస్తారాయన.. తాజాగా కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో సూపర్‌స్టార్‌ చేస్తున్న 165వ చిత్రం టైటిల్‌ను ‘పేటా అని ఇటీవల ప్రకటించిన విషయం విదితమే.. యుపి రాజధాని లఖ్‌నవూ, వారణాశిలో ఈచిత్రం నెలరోజులపాటు షూటింగ్‌ జరుపుకుంటోంది.. కాగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం రజనీకి 25 మంది పోలీసులను సెక్యూరిటీగా నియమించారు.. ఈచిత్రం విషయానికొస్తే.. రజనీ సరసన సీనియర హీరోయిన్‌ సిమ్రాన్‌ నటిస్తుండగా, ఇతర కీలకపాత్రల్లో విజ§్‌ుసేతుపతి, నవాజుద్దీన్‌ సిధ్దిఖీ నటిస్తున్నారు. రజనీ సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.. యువ సంగీత సంచలనం అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈచిత్రాని నిర్మిస్తోంది.