పవన్ ను కలవబోతున్న రాజమౌళి..కారణం అదేనా..?

దర్శక ధీరుడు రాజమౌళి..పవన్ కళ్యాణ్ ను కలవబోతున్నట్లు తెలుస్తుంది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ జనవరి 07 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ మూవీ గా తెరకెక్కిన ఈ చిత్రం ఫై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కారణంగా పలు సినిమాలు వాయిదా వేసుకోవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మాత్రం ఆర్ఆర్ఆర్ దీటుగా జనవరి 12 న విడుదల కాబోతుంది. దీంతో ఆర్ఆర్ఆర్ కలెక్షన్లకు , థియేటర్స్ కు సమస్య ఏర్పడనుంది.

ఈ క్రమంలో భీమ్లా నాయక్ ను వాయిదా వేసుకోవాలని పవన్ కళ్యాణ్ ను రాజమౌళి కోరనున్నట్లు వినికిడి. అయితే ఇప్పటికే సంక్రాంతి సినిమాల విడుదల గురించి ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ నిర్మాతల మధ్య చర్చలు జరగగా అవి సఫలం కాలేదు. ఇందులో ముఖ్యంగా ‘భీమ్లా నాయక్’ను వెనక్కి తగ్గమంటూ మిగతా నిర్మాతలు ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.

రాజమౌళి, పవన్ సమావేశాని కంటే ముందు నిర్మాతలు దానయ్య, దిల్ రాజు, యూవీ క్రియేషన్స్ వంశీతో పాటు ఇతరులు డైరెక్టర్ త్రివిక్రమ్‌ని కలవడానికి ప్లాన్‌ చేస్తున్నారని, ‘భీమ్లా నాయక్’ విడుదలను వాయిదా వేసి, ‘ఆర్ఆర్ఆర్’ కోసం రూట్ క్లియర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి భీమ్లా నాయక్ ఓ మెట్టు తగ్గుతాడా లేదా అనేది చూడాలి.