ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో కు రాజమౌళి , కొరటాల

ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' షో కు రాజమౌళి , కొరటాల

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ షో కు అగ్ర దర్శకులైన రాజమౌళి , కొరటాల శివ హాజరైనట్లు తెలుస్తుంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేసారు. ఈ ప్రోమో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఈ ఎపిసోడ్ సెప్టెంబర్ 20 సోమవారం నాడు ప్రాసారం కానుంది. ఈ షో తొలి ఎపిసోడ్‌కి రామ్ చ‌ర‌ణ్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌రై తెగ సంద‌డి చేశారు. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ఒకే ఫ్రేములో క‌నిపించే స‌రికి ఫ్యాన్స్ కూడా తెగ మురిసిపోయారు.

ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్‌లో ‘స్టూడెంట్ నంబర్ 1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’ మూవీస్ వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో రామ్ చరణ్ మరో హీరోగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రాబోతోంది. అలాగే ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో ‘జనతా గ్యారేజ్’ వచ్చి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక త్వరలోనే కొరటాల దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ 30’ మొదలవబోతోంది. దాంతో సోమవారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌లో ‘ఆర్ఆర్ఆర్’, ‘ఎన్టీఆర్ 30’ చిత్రాలకి సంబంధించి ఎలాంటి విషయాలను పంచుకోబోతున్నారో అనే ఆసక్తి అందరిలోనూ విపరీతంగా పెరుగుతోంది.

Can’t Wait 😻😻

Next Week @tarak9999 🔥#EvaruMeeloKoteeswarulu#ManOfMassesNTR pic.twitter.com/SMuIn0uAGY— Troll NTR Haters (@TrollNTRHaterz) September 16, 2021