హైదరాబాద్ కు చేరుకున్న ఆర్ఆర్ఆర్ ఫ్యామిలీ

ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ అందుకున్న ఆర్ఆర్ఆర్ టీం హైదరాబాద్ కు చేరుకున్నారు. బాహుబలి సినిమా తో తెలుగు సినీ సత్తా ఏంటో దేశ వ్యాప్తంగా చాటి చెప్పిన రాజమౌళి…ఆర్ఆర్ఆర్ తో ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేసాడు. ఈ మూవీ లోని నాటు నాటు సాంగ్ కు ఏకంగా ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ అవార్డు రావడం పట్ల యావత్ తెలుగు ప్రజానీకమే కాదు దేశ ప్రజానీకం కూడా గర్వంగా ఫీల్ అవుతుంది. ఇది కదా కోరుకునేది అంటూ సగటు సినీ అభిమాని మాట్లాడుకుంటున్నారు.

ఆస్కార్‌ వేదిక మీద సందడి చేసిన RRR టీమ్‌ సభ్యులు ఒక్కొక్కరిగా హైదరాబాద్‌కి చేరుకుంటున్నారు. రీసెంట్‌గా ఎన్టీఆర్‌ హైదరాబాద్‌కి చేరుకోగా..ఎయిర్ పోర్ట్ లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. నేడు ఉదయం కీరవాణి, రాజమౌళి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ కు చేరుకున్నారు. కీరవాణి, శ్రీవల్లి, కాలభైరవ, రాజమౌళి, రమ, కార్తికేయతో పాటు కుటుంబసభ్యులందరూ హైదరాబాద్‌ ఎయిర్ పోర్టులో దిగారు. ట్రిపుల్‌ ఆర్‌ టీమ్‌తో మాట్లాడే ప్రయత్నం చేసింది మీడియా. అయితే జై హింద్‌ అంటూ నినాదం చేసుకుంటూ వెళ్లారు రాజమౌళి. ఇక ఈరోజు రాత్రి రామ్‌చరణ్‌, ఉపాసన లు హైదరాబాద్ లో అడుగుపెట్టబోతున్నారు. వీరికి ఘనస్వాగతం పలికేందుకు మెగా అభిమానులు సిద్ధంగా ఉన్నారు.