రాజమండ్రిలో భారీ వర్షం..

ఏపీ రాష్ట్రాన్ని వర్షాలు వదలడం లేదు. మూడు రోజుల క్రితం వరకు కడప, నెల్లూరు , చిత్తూరు జిల్లాలో ఎంత భారీ వర్షాలు పడ్డాయో తెలియంది కాదు..ఈ వర్షాల బీబత్సం నుండి ఆయా జిల్లాలు బయటపడలేదు. ఈ లోపే రాజమండ్రి లో భారీ వర్షం పడుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ఇదిలా ఉంటె బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త ప్రకటించింది. ఈసారి కూడా నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపైనే ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

నైరుతి బంగాళాఖాతంలోని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తోందని… ఈ కారణంగా ఈనెల 27 నుంచి ఆయా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తన నివేదికలో వెల్లడించింది. అనంతపురం, గుంటూరు, కృష్ణా జిల్లాలలో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడంతో వరద బాధిత జిల్లాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు.