అందుకే నన్ను సర్కారు అరెస్ట్‌ చేసింది

Raja Singh
Raja Singh

హైదరాబాద్‌: బిజెపి ఎమ్మెల్యె రాజాసింగ్‌ తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణాన్ని వ్యతిరేకించానని అందుకే రజాకార్ల ప్రభుత్వం తనను అరెస్ట్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత భారీ మొత్తంతో కొత్త సచివాలయం కట్టే బదులుగా, ఆ మొత్తాన్ని ఉస్మానియా ఆసుపత్రి పునరుద్ధరణ, స్కూళ్ల నిర్మాణం కోసం వెచ్చించాలరాష్ట్రంలో చాలాచోట్ల పాఠశాలలు దశాబ్దాలుగా పూర్తిస్థాయిలో నిర్మాణానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎమ్మెల్యె రాజాసింగ్‌ తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/