అసత్యాలు మాట్లాడుతూ రాజకీయాలు వద్దు

సీఏఏ వల్ల ఎవరికి అన్యాయం జరుగుతుందో నిరూపించాలి..అసెంబ్లీలో రాజాసింగ్ సవాల్

raja-singh
raja-singh

హైదరాబాద్‌: బిజెపి ఎమ్మెల్యె రాజాసింగ్‌ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ.. సిఎం కెసిఆర్‌ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.సీఏఏ వల్ల ఎవరికైనా అన్యాయం జరుగుతుందని నిరూపిస్తే… ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తెలంగాణ నుంచి వెళ్లిపోతానని చెప్పారు. ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం సరికాదని అన్నారు. సీఏఏ వల్ల ఎవరికి అన్యాయం జరుగుతుందో కెసిఆర్‌ చెప్పాలని డిమాండ్ చేశారు. అసత్యాలు మాట్లాడుతూ రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్నార్సీల వల్ల ఎవరికీ అన్యాయం జరగదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పినప్పటికీ విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మైకును స్పీకర్ కట్ చేశారు. దీంతో, తీర్మాన ప్రతులను రాజాసింగ్ చింపేశారు. ప్రజలను కెసిఆర్‌ మోసం చేస్తున్నారని నినదించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/