వర్షాకాలంలో ఇంటి శుభ్రత

పరిసరాల పరిశుభ్రత

rainy season-Frequent home problems
rainy season-Frequent home problems

వర్షాకాలంలో తరచుగా ఇంటి సమస్యలు ఎదురవుతుంటాయి. దీంతో మీ ఇంటిగోడలపై నాచు, బూజు వస్తుంది. అలాగే తేమ వాసన వస్తుంది. గోడలను నాశనం చేస్తున్న సీపేజను మరిచిపోవద్దు.

కాబట్టి ఈ సమయంలో ఇంటిని భద్రంగా ఉంచుకునేందుకు ఇంటిని ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకోవడం మంచిది. గోడలు, పైకప్పుల ప్రాంతాల్లో పగుళ్లు ఉన్నాయేమో చూడాలి. అన్నంటిని ఒకసారి చెక్‌చేయాలి.

సమస్యాత్మకంగా ఉన్న వాటిని రిపేర్‌ చేయాలి. గోడలలోని పగుళ్లు తేమకు దారితీస్తాయి. కాలక్రమేణా ఫంగస్‌, తడి ప్యాచెస్‌ పెరుగుతాయి.

rainy season-Frequent home problems

ఈ కారణంగా గోడలతో సంబంధం ఉన్న ప్రతిదీ నాశనం అవుతుంది. దీనికి తాత్కాలిక పరిష్కారం కోసం, క్రాక్‌ ఫిల్‌ పుట్టీతో వాడవచ్చు. వర్షాకాలంలో కార్పెట్స్‌, రగ్గులను జాగ్రత్త చేసుకోవాలి. వర్షాకాలం అయిపోయే వరకు వాటిని చల్లని పొడి ప్రదేశంలో భద్రపరిచేలా చూసుకోవాలి.

నిలువ చేయడానికి ముందు వాటిని డ్రై చేయడం ప్పనిసరి. కరెంట్‌ వైర్లను రిపేర్‌ చేయడానికి ఎక్కువ సమయం కేటాయించవద్దు.

ఎందుకంటే అవి ఖర్చుతో కూడుకున్నవి. భారీ వర్షాలు సంభవించి నప్పుడు, పవర్‌ ఫెయిల్యూర్‌, షార్ట్‌ సర్క్యూట్‌లకు కారణం కావచ్చు. కాబట్టి అన్ని వైర్లు సరైన రక్షణ వ్యవస్థలో ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి.

ఏదైనా అవకాశం ఉంటే మీటర్‌, లేదా కరెంట్‌ వ్యవస్థ ఉన్న భాగంలో వర్షంలో తడువకుండా ప్లాస్టిక్‌తో కప్పాలి. వరండాల్లో ముఖ్యంగా వర్షం జల్లు పడే ప్రాంతంలో చెక్క ఫర్నిచర్‌ లేకుండా చూసుకోవాలి.

అంతేకాకుండా చెక్కతో కూడిన ఫర్నిచర్‌ను గోడలకు కొన్ని అంగుళాల దూరంలో ఉండేలా చూసుకోవాలి. ఫర్నిచర్‌ని శుభ్రం చేయడానికి ఎల్లప్పుడూ పొడి బట్టని వాడాలి.

చెక్క అల్మారాలు, క్యాబినెట్‌లు, డ్రాయర్లలో వేప ఆకుల వంటి సహజ ప్రత్యామ్నాయాలు కానీ, నాఫ్తలీన్‌ బాల్స్‌ కానీ ఉంచాలి.

చెక్క ఫ్లోరింగ్‌ కోసం

సాధ్యమైనంతవరకు పొడి తుడుపు కర్రను ఉపయోగించాలి. కీటకాలు, దోమలకు దుర్వాసన వచ్చే ప్రాంతాలు సంతానోత్పత్తి ప్రదేశాలు కాబట్టి కాలువలను అన్‌లాగ్‌ చేయాలి.

నీరు ఇంట్లోకి రాకుండా, కిటికీల మీద షేడ్స్‌ ఉండాలని గుర్తుంచుకోవాలి. వర్షం పడనప్పుడు కిటికీలను తెరిచి ఉంచాలి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/