ఏపిలో పలు జిల్లాలో వర్షాలు

heavy rain
heavy rain

అమరావతి: ఏపిలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రెండు గంటల పాటు ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుంటూరు జిల్లాలోని బాపట్ల, కర్లపాలెం, పిట్టలవాని పాలెం మండలాల్లో తెల్లవారు జామునుంచి వర్షం కురుస్తోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి ఉరుములు,మెరుపులు తోడవ్వడంతో అధికారులు విద్యుత్‌ నిలిపివేశారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. చీరాల, వేటపాలెం, చినగంజాం, పరుచూరు, మార్టూరు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. చీరాలలో ఉరుములతో కూడిన జల్లులు పడ్డాయి. వర్షం ధాటికి మార్టూరు మండలం పలపర్రులో పెంకుటిల్లు కూలిపోయింది. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. జెండా వీధి, సీపీఐ కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. కాలనీ వాసులు రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/