హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం

rain fall in hyderabad
rain in hyderabad

హైదరాబాద్; నగరం లోని పలు ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షం కురిసింది. నగరం లోని జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, అమీర్ పేట్, ముషీరాబాద్, చిక్కడపల్లి , రాం నగర్, కవాడిగూడ, పంజాగుట్ట ప్రాంతాలలో వర్షం కురవడం తో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మరోవైపు రాగల మూడు రోజులపాటు అక్కడక్కడా ఉరుములతో పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటలలో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి ; https://www.vaartha.com/andhra-pradesh/