తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడి

తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం
Rainfall in Telangana (File)

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది.

కర్నాటక నుంచి మహారాష్ట్ర వరకు ఉపరిత ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది.

తమిళనాడు నుంచి మహారాష్ట్ర వరకు 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని, వీటి ప్రభావంతో ఇవాళ తెలంగాణలోని పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/