గుంతటూరు…

  • నిత్యం నగర వాసులకు నరకం చూపుతున్నరోడ్లు
  • భారీ వర్షానికి కొత్తపేట రోడ్లన్నీ జలమయం
  • గంటల తరబడి నిలిచిపోతున్న ట్రాఫిక్‌

కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న గుంటూరు నగరం గుంటలూరుగానే ఉంది. కొద్దిపాటి వర్షం కురిసినా రోడ్లన్ని తటాకాల్లా మారి పాదచారుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. నిత్యం సాయంత్రం వర్షమే. దీంతో నగరంలో వందలాది వాహనాలతో కిటకిటలాడుతుంది. చెరువుల్లా కనిపిస్తున్న రోడ్లపై వాహనాలు వెళ్లాలంటే గంటల కొద్ది ట్రాఫిక్‌ నిలిచిపోతుంది.

ఇరుకు రోడ్లపై ఇక్కట్లు తప్పటం లేదు. మురుగు కాలువలోని నీరంతా రోడ్లపైకి చేరుతోంది. శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి నగరంలో కొత్తపేట, మార్కెట్‌, వెంకటేశ్వరవిజ్ఞానమందిర్‌ ప్రాంతంలోని రహదారులన్నీ మోకాలి లోతు నీటితో నిండిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్‌ నిలిచిపోయింది. నిత్యం సాయంత్రంవేళ ఇలాంటి పరిస్థితే ఏర్పడి నగరవాసులు నరకం అనుభవిస్తున్నారు. ఈ రోడ్లన్నింటిని విస్తరించడానికి ఎన్నేళ్లు పడుతుందో గుంటూరు కార్పోరేషన్‌ అధికారులకే తెలియాలి.

Guntur: నగరంలో సాయంత్రం నుండి కుండపోత వర్షం కురిసింది. దీంతో భారీగా రోడ్లమీదకి వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. శంకర్ విలాస్, కంకరగుంట, మార్కెట్ సెంటర్, లాడ్జి సెంటర్లో పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కిమీ మేర వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్న ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.