నేడు, రేపు ఓ మోస్తారు జల్లులు కురిసే అవకాశం

వాతావరణ శాఖ వెల్లడి

Rain in Hyderabad-
Rain in Hyderabad-

Hyderabad: మండే ఎండాకాలంలో ‘గ్రేటర్’ ప్రజానీకాన్ని వరుణుడు చల్లగా పలకరించాడు. నగరంలో పలు ప్రాంతాల్లో రాత్రి చిరు జల్లులు కురిశాయి . తెల్లవారుజాము దాకా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతోనే చిరు జల్లులకు అవకాశం ఏర్పడిందని, కొన్ని ప్రాంతాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు

.ఖైరతాబాద్, కూకట్ పల్లి, అమీర్ పేట, మలక్ పేట,మెహిదీపట్నం, దిల్ సుఖ్ నగర్, మాదాపూర్, ప్రాంతాల్లో వర్షం కురిసింది. సగటు ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకు తగ్గాయి. నేడు, రేపు కూడా ఓ మోస్తారు జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారు తెలిపారు

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/