హైద‌రాబాద్ లో భారీ వర్షం

Rain forecast for Telangana for five days

హైద‌రాబాద్ లో జోరు వ‌ర్షం కురుస్తున్న‌ది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, మియాపూర్, కూక‌ట‌ప‌ల్లి, నాంప‌ల్లి, దిల్ షుక్ న‌గ‌ర్, చిక్క‌డ‌ప‌ల్లి,,ఎల్ బి నగ‌ర్, కొండాపూర్, లింగ‌ప‌ల్లితో స‌హా న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాలు ఈ వ‌ర్షానికి జ‌ల‌మ‌యం అయ్యాయి. కొద్దిపాటి వ‌ర్షానికి ప‌లు ప్రాంతాల‌లో ట్రాఫిక్ నెమ్మ‌దిగా కొన‌సాగుతున్న‌ది.

రాష్ట్రంలో మరో వారం రోజులు పాటు తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా శుక్రవారం కూడా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్నిచోట్లు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.