తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
వాతావరణ శాఖ వెల్లడి

తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఎంఫాన్ తుపాను మరింత బలపడటంతో ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మే 20వ తేదీ మధ్యాహ్నానికి హతియా దీవులు, సాగర్ ద్వీపాల మధ్య తుఫాను తీరం దాటనుందని తెలిపింది.
ఈ కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/