నగరంలో పలుచోట్ల వర్షం

మరో రెండు రోజులు వర్షాలు: విశాఖ వాతావరణ వాఖ

Rain fall
Rain fall

హైదరాబాద్‌: నగరంలోని వాతావరణం అత్యంత చల్లగా మారింది. ఈరోజు పలు చోట్ల వర్షం కురుస్తుంది. దీంతో ఓ వైపు చలి, మరోవైపు వర్షంతో భాగ్యనగరవాసులు వణుకుతున్నారు. బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఉదయం స్కూళ్లకు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లే వారు చల్లటి వాతావరణంతో ఇబ్బందులు పడుతున్నారు.మరోవైపు అటు ఏపీలో కూడా పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో… కోస్తాంధ్ర జిల్లాలో వానలు కురుస్తున్నాయి. రెండు రోజలు పాటు వర్షాలు పడుతాయని విశాఖ వాతావరణ వాఖ అధికారులు చెబుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదైనా, మేఘాల ప్రభావం కారణంగా పగటి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, తేమగాలులు వీస్తుండడంతో తెలుగు రాష్ట్రాల్లో చలి పెరిగిందని తెలిపారు అధికారులు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/