అత్య‌వ‌ర‌మైతే త‌ప్ప బ‌య‌కు రాకూడదంటూ కోస్తా ప్రజలకు హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు , ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ విషయానికి వస్తే నెల్లూరు , కడప , కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండడం తో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే పలు జిల్లాలో ప్రభుత్వ స్కూల్స్ కు రెండు రోజుల పాటు సెలవులు ఇవ్వగా..ద‌క్షిణ కోస్తా జిల్లాల ప్రజలకు హెచ్చరిక జారీచేసింది. అత్య‌వ‌ర‌మైతే త‌ప్ప బ‌య‌కు రాకూడదంటూ తెలిపింది. ఏపీలో గంట‌కు 40 నుండి 50 కిమీల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా ఉంద‌ని చేప‌ల వేట‌కు వెళ్లే మ‌త్స్య‌కారులు వేట‌కు వెళ్లొద్ద‌ని సూచించింది.

ఇక చెన్నై మహానగరం కుండపోత వర్షాలతో నిండుకుండలా మారింది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. చాలా కాలనీలు నీళ్లలో మునిగిపోయి ఉన్నాయి. తినడానికి తిండిలేక, రాత్రిపూట కరెంటు లేక చెన్నై నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ సహాయక చర్యలను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. భారీ వర్షాలకు తోడు, ఈదురుగాలులు కూడా ఉండటంతో రోడ్లపైన చెట్లు అడ్డంగా కూలిపోయాయి. దాదాపు ఐదొందల కాలనీల్లో వర్షపు నీరి నిలిచిపోయి ఉందని, 65000 ఇళ్లకు ఇప్పటికీ విద్యుత్‌ సరఫరా లేదని అధికారులు చెబుతున్నారు. ముంపు ప్రాంతాల నుంచి 2440 మందిని రిలీఫ్‌ క్యాంపులకు తరలించారు.